Sircilla: రాహుల్ గాంధీ చిత్రపటంతో బతుకమ్మ పేర్చిన కాంగ్రెస్ నేత!
Sircilla: రాచర్ల గొల్లపల్లిలో రాహుల్ గాంధీ చిత్రపటంతో బతుకమ్మ అలంకరణ. వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ నాయకుడు గోగూరి శ్రీనివాస్ రెడ్డి!
Sircilla: రాహుల్ గాంధీ చిత్రపటంతో బతుకమ్మ పేర్చిన కాంగ్రెస్ నేత!
Sircilla: సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోగూరి శ్రీనివాస్ రెడ్డి వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. కళాకారుడు శ్యామంతుల అనిల్ చేత బతుకమ్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని వేయించి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంతో బతుకమ్మను అలంకరించడంతో పాటు బోనం, సంక్రాంతి ముగ్గులపై కూడా ఆయన చిత్రాలను వేయించిన శ్రీనివాస్ రెడ్డి.. ఈసారి రాహుల్ గాంధీ చిత్రంతో మరోసారి స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో కళను జోడిస్తూ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవడం గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణుల దృష్టిని ఆకర్షించింది.




