Sircilla: వృద్ధులకు అన్నదానం చేస్తున్న అన్నపూర్ణ ఫౌండేషన్ సేవలు అభినందనీయం!

Sircilla: సిరిసిల్లలో వృద్ధులకు ఉచితంగా అన్నదానం అందిస్తున్న అన్నపూర్ణ ఫౌండేషన్ సేవలను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి కొనియాడారు.

KALEEM, SIRICILLA
Published on: 4 Nov 2026 12:52 PM IST
Sircilla
X

Sircilla: వృద్ధులకు అన్నదానం చేస్తున్న అన్నపూర్ణ ఫౌండేషన్ సేవలు అభినందనీయం!

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం గూడెం గ్రామానికి చెందిన కూర సావిత్రి ఆధ్వర్యంలోని అన్నపూర్ణ ఫౌండేషన్ బృందం సిరిసిల్లలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి అభినందించారు.

ముఖ్యంగా వృద్ధులకు ప్రతిరోజూ అన్నం వండి అందిస్తూ వారి ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. సమాజ సేవలో భాగంగా నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం అన్నపూర్ణ ఫౌండేషన్ బృందాన్ని డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి చిరు సత్కారం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA