Siricilla: ప్రత్యేక పోలీస్ స్టేషన్ల మంజూరుపై హర్షం..రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు!

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేయడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం.

KALEEM, SIRICILLA
Published on: 5 Oct 2026 1:58 PM IST
Siricilla
X

Siricilla: ప్రత్యేక పోలీస్ స్టేషన్ల మంజూరుపై హర్షం..రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు!

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేయడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రత్యేక పోలీస్ స్టేషన్ల మంజూరుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మహిళల భద్రతకు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు గతంలో సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గడ్డం నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు బిళ్ల వెంకట్రాములు, జిల్లా ప్రధాన మహిళా కార్యదర్శి త్రివేణి, వేములవాడ టౌన్ మహిళా అధ్యక్షురాలు అఖిల, వేములవాడ టౌన్ ఉపాధ్యక్షురాలు మమత, మహేష్ యాదవ్, తంగళ్లపల్లి మండల అధ్యక్షులు ఎగుర్ల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల కనకరాజు, చందుర్తి మండల యువజన విభాగం అధ్యక్షులు కత్తి రమేష్, మ్యాక అజయ్, ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA