Ramagiri: బేగంపేట పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ కలకలం!

Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట పెద్దమ్మతల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సొత్తు అపహరణ.. పోలీసుల దర్యాప్తు.

SHANKAR, MANTHANI
Published on: 16 Aug 2026 2:11 PM IST
Ramagiri
X

Ramagiri: బేగంపేట పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ కలకలం!

Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు.. అనంతరం ఆలయంలోని విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది.

చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రామగిరి పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story