Mallapur: మల్లాపూర్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం!

Mallapur: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 5:14 PM IST
Mallapur
X

Mallapur: మల్లాపూర్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం!

మల్లాపూర్: మల్లాపూర్ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన టీచర్ లకు సోమవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసారు. వేముల శ్రీనివాస్,ప్రాథమిక పాఠశాల హెచ్ఎం (మొగిలిపేట),తోట లింగన్న,స్కూల్ అసిస్టెంట్ (మొగిలిపేట),బూరుగుపల్లి నర్సింగరావు, ప్రాథమిక పాఠశాల (రేగుంట),జెట్టి శ్రీలత ఎస్.ఓ (కేజీబీవీ)లను మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ బీ.సీ సంఘం మండల అధ్యక్షులు ఇల్లేందుల రమేష్, మండలపాత్రికేయులు ఈనాడు కృష్ణమాచారి, నమస్తే తెలంగాణ సంజీవ్, జరుపుల రమేష్, వంగ శేఖర్, ఉడుగుల గంగాధర్, శేఖర్, పెంబి మహేష్, వెంకటేష్, భా.జ.పా నాయకులు సత్య నారాయణ,ఎర్ర రాజు సామాజిక కార్యకర్త వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story