Jagtial: జగిత్యాలలో నిరుపేద యువతి వివాహానికి రూ.15 వేల ఆర్థిక సాయం!
Jagtial: జగిత్యాలలో నిరుపేద యువతి వివాహానికి భక్త మార్కండేయ యువజన సమితి రూ.15 వేల ఆర్థిక సాయం, పట్టుచీర అందజేసింది. జ్యోతి లక్ష్మణ్ సేవలను కొనియాడారు.
Jagtial: జగిత్యాలలో నిరుపేద యువతి వివాహానికి రూ.15 వేల ఆర్థిక సాయం!
Jagtial: గత 15 ఏళ్లుగా నిరుపేదలకు అండగా నిలుస్తూ ‘శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి’ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు.
స్వామి వివేకానందుని స్ఫూర్తితో "ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న" అనే నినాదంతో సమితి ఆధ్వర్యంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 25న జరగనున్న రాయికల్ గ్రామానికి చెందిన గోసికొండ జమున–కిషన్ దంపతుల కుమార్తె వివాహం నిమిత్తం రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జ్యోతి లక్ష్మణ్ దంపతుల చేతుల మీదుగా ఈ నగదును అందజేశారు. అలాగే, గీత సిల్క్ హౌస్ అధినేత కస్తూరి జగదీశ్వర్ కుమారుడు శశిధర్–లహరిక దంపతుల సహకారంతో వధువుకు కంచి పట్టు చీరను బహూకరించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ సమితి 15 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలకు వివాహాలు, విద్య, ఆపద సమయాల్లో ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమన్నారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని పేర్కొంటూ, సమితి సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సమితి కార్యనిర్వాహకులు ఆకుబత్తిని (గౌరి) శ్రీనివాస్, కొక్కుల సుదర్శన్, జోగ మల్లేశం, సంగీత శ్రీనివాస్, చెన్న రమేష్, మాచర్ల శంకర్, కొక్కుల శేఖర్, పొలాస శంకర్, బోగ రాజేశం, అలుసా రామప్రకాశ్, చిలుక రాజన్న, బోగ చిన్న గంగాధర్, తవుటూ రామచంద్రం, చెట్పెల్లి సుధాకర్, వీరభత్తిని అనిల్, సామల నటశేఖర్, సింగం గంగాధర్, నందగిరి నర్సయ్య, స్వర్గం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.




