Jammikunta: జగ్గయ్యపల్లిలో భూలక్ష్మి మాలక్ష్మి చందా

Jammikunta: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో భూలక్ష్మి మాలక్ష్మి చందా కార్యక్రమం ప్రారంభం.

GANESH, JAMMIKUNTA
Published on: 2 Jun 2026 5:34 PM IST
Jammikunta
X

Jammikunta: జగ్గయ్యపల్లిలో భూలక్ష్మి మాలక్ష్మి చందా

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లోని జగ్గయ్యపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూలక్ష్మి మాలక్ష్మి చందా కార్యక్రమంలో మొదటి చందాను గ్రామ మాజీ సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మంచి మనసుతో రూ. 20,016/- విరాళాన్ని సమర్పించి కార్యక్రమానికి శుభారంభం చుట్టారు గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ చందా కార్యక్రమానికి గ్రామస్థులు విశేష స్పందన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని మాజీ సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట గ్రామ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story