Karimnagar: కరీంనగర్‌లో వరుస బైక్ దొంగతనాలు..నిందితుడు సాయికృష్ణ అరెస్ట్!

Karimnagar: కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దుర్గం సాయి కృష్ణ అరెస్ట్. మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Oct 2026 11:49 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో వరుస బైక్ దొంగతనాలు..నిందితుడు సాయికృష్ణ అరెస్ట్!

Karimnagar: కరీంనగర్-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దుర్గం సాయి కృష్ణ (24) అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు కరీంనగర్‌లోని విద్యానగర్, హరిహరనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో పార్క్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను దొంగిలించి తన ఇంటి వద్ద దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుడి వద్ద నుంచి సుమారు మూడు దొంగిలించిన బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా బైక్ దొంగతనం, గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN