Jammikunta: ఘనంగా ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదిన వేడుకలు
Jammikunta: బిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంటలో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి.
Jammikunta: ఘనంగా ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదిన వేడుకలు
Jammikunta: బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శివాలయం(బొమ్మల గుడి)లో అన్నధానం నిర్వహించిన అనంతరం స్థానిక గాంధి చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ జమ్మికుంట పట్టణ మాజీ ఆధ్యక్షుడు జీడీ మల్లేష్ మాట్లాడుతూ ఎర్రబెల్లి సంపత్ రావు.
విద్యార్థి దశలోనే సామాజిక చైతన్యంతో ముందుకు వచ్చి అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏబీవీపీ) లో చేరి విద్యార్థుల సమస్యల పైన ఉద్యమించాడని తెలిపారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జమ్మికుంట మండల బీజేవైఎం ఆధ్యక్షుడుగా,బిజెపి మండల అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పార్టీ పటిష్టతకు పనిచేసాడని మల్లేష్ గుర్తు చేశాడు.బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ, జాతీయ భావజాలంతో సేవా కార్యక్రమాలు చేపట్టారని,వారి క్రమశిక్షణ,కృషి, పట్టుదల, నిబద్ధత గుర్తించిన బిజెపి నాయకత్వం గతంలో అతనికి బిజెపి జిల్లా కార్యదర్శిగా,
బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పజెప్పారని, ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి సంపత్ రావు కృషి చేసాడని మల్లెష్ కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడు సంపత్ రావు అని కితాబిచ్చాడు.
ఈ శుభ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సంపత్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. రాబోయే రోజుల్లో సంపత్ రావు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మలేష్ భగవంతున్నీ ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ అధ్యక్షులు జీడి మల్లేష్, పల్లపు రవి, కొమ్మ అశోక్, మేక సుధాకర్ రెడ్డి, కొండ్లె నాగేష్, తూడి రవిచంద్ర రెడ్డి, ఉడుగల మహేందర్, కొండపర్తి ప్రవీణ్, పోడేటి అనిల్, మురికి మహేష్, యాంసాని సమ్మయ్య, అప్పల రవీందర్, ఎర్ర వెంకటేష్, బొజ్జ శరత్, లకిడి రాజు, గడ్డం శ్రీ వర్ధన్, పల్లబోయిన పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.




