Sircilla: సిరిసిల్ల టీపీయూఎస్ ధర్నాకు బీజేపీ సంఘీభావం
Sircilla: రాజన్న సిరిసిల్లలో టీపీయూఎస్ నిరసన. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల సాధనలో అండగా ఉంటామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.
Sircilla: సిరిసిల్ల టీపీయూఎస్ ధర్నాకు బీజేపీ సంఘీభావం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు కొత్త ప్రయోజనాలు కోరడం లేదని, చట్టబద్ధంగా తమకు రావాల్సిన హక్కులు, బకాయిలు, ప్రభుత్వ హామీల అమలును మాత్రమే కోరుతున్నారని అన్నారు.
పీఆర్సీ రిపోర్టు విడుదల చేసి 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, ఆర్‌డీఏ ప్రకటించడం, పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు సహా టీపీయూఎస్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయ సంఘం వినతిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అన్ని స్థాయిల్లో పోరాడుతుందని రెడ్డబోయిన గోపి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, టీపీయూఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.




