Peddapalli: రామగుండంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన బీజేపీ!
Peddapalli: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రామగుండంలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించిన బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి. వారి సేవలు అమోఘమని ప్రశంస.
Peddapalli: రామగుండంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన బీజేపీ!
Peddapalli: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భం నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పారిశుధ్య కార్మికుల సేవలకు బీజేపీ ఘనంగా సన్మానించారు.
కార్మికుల కాళ్లు కడిగి గౌరవించిన బీజేపీ శ్రేణులు,పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించి, వారి సేవలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం ఎండా, వానను లెక్కచేయకుండా కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు.
సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రతిరోజూ విధుల్లో పాల్గొంటూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి వారి శ్రమ వల్లే పట్టణాలు, కాలనీలు పరిశుభ్రంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి బాధ్యత, పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, వారికి గౌరవం ఇవ్వడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని అని కందుల సంధ్యారాణి అన్నారు.
భారతీయ జనతా పార్టీ పిలుపుతో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రామగుండం ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ జక్కుల పద్మ, పరకాల మురళి, పరకాల శ్రీలత, లగిశెట్టి సబిత,కందుల స్వరూప,జక్కన బాలు సిలారపు కళ్యాణ్, బరుపటి నారాయణ, ఎరుకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




