Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్యాలయం ముట్టడి యత్నం!

Karimnagar: కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి యత్నంపై బీజేపీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు సీపీకి ఫిర్యాదు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 22 July 2026 11:09 PM IST
Karimnagar
X

Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్యాలయం ముట్టడి యత్నం!

కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు , బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు , ముఖ్య నేతలతో కలిసి కరీంనగర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలోకి దౌర్జనంగా చొరబడాలని ప్రయత్నించి, దాడులకు యత్నించారని ప్రవీణ్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్లమెంట్ కార్యాలయంలో ఉన్న నాయకులను బెదిరింపులకు గురిచేస్తూ దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు పోలీసు కమిషనర్‌ను కోరారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story