Siricilla: మే 10 మోదీ సభను విజయవంతం చేయాలి: రెడ్డబోయిన గోపి
Siricilla: మే 10న సికింద్రాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు.
Siricilla
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. మే 10, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.
రైల్వే రంగంలో తెలంగాణకు రూ.85 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వాటిలో పలు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.
హైదరాబాద్ – యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్‌కు టెండర్ ప్రక్రియ పూర్తైందని, భూసేకరణ పూర్తికాగానే పనులు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. అలాగే సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేయడం తెలంగాణ గిరిజన సమాజానికి ఉపయోగకరమని తెలిపారు.
మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




