Karimnagar: కరీంనగర్‌లో వృద్ధురాలపై దోపిడి దొంగ దాడి - నగలు అపహరణ
Karimnagar: కరీంనగర్‌లో దోపిడి దొంగ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమ్మను బీజేపీ నేత సునీల్ రావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
Karimnagar: కరీంనగర్‌లో వృద్ధురాలపై దోపిడి దొంగ దాడి - నగలు అపహరణ
కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న జంగం రాజమ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి కిసాన్ నగర్‌కు చెందిన మునుగొండ మధు అనే వ్యక్తి దొంగతనానికి చొరబడి, ఆమెపై దాడి చేసి తలను బలంగా గోడకు కొట్టి తీవ్రంగా గాయపరిచి, దాడి అనంతరం నిందితుడు ఆమె మెడలోని పుస్తెలు, కమ్మలు దొంగిలించి పరారయ్యాడు.
స్థానిక కార్పొరేటర్ బోట్ల శ్యామల- కిరణ్ సమాచారం మేరకు ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఏషియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వారు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమెకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. అనంతరం బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడికి తెగబడటం అత్యంత దారుణమని, నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల-కిరణ్, వైద్య సిబ్బంది, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




