Choppadandi: రాగంపేట బిఎల్ఓలను ఘనంగా సన్మానించిన బీజేపీ!

Choppadandi: రాగంపేట గ్రామంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బూత్ లెవల్ అధికారులను (BLO) బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 11 July 2026 9:55 PM IST
Choppadandi
X

Choppadandi: రాగంపేట బిఎల్ఓలను ఘనంగా సన్మానించిన బీజేపీ!

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో ముందంజలో ఉన్న బూత్ లెవల్ అధికారులను (బిఎల్ఓ) బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామంలోని మూడు పోలింగ్ బూత్‌లలో మ్యాపింగ్ అయిన ఓట్లలో దాదాపు 70 శాతం నమోదును పూర్తి చేసి, నియోజకవర్గంలోనే మొదటి ఐదు స్థానాల్లో నిలిచినందుకు గాను బిఎల్ఓలు కుక్కల లక్ష్మణ్, మామిడి పోచయ్య, బొల్లం సరోజనలను బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ సవరణ పత్రాల నమోదులో రాగంపేట గ్రామం నియోజకవర్గంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఇందుకు కృషి చేసిన బిఎల్ఓలు, ఎన్నికల అధికారులతో పాటు సహకరించిన గ్రామస్థులకు ఆయన అభినందనలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా బూత్ లెవల్ అధికారులతో పాటు పౌర సమాజం కూడా బాధ్యతగా శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకోని వారు ఉంటే, వెంటనే సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి ఫారాలను అందజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, సింగసాని కనకయ్య, నరేష్, సిరవేణి మల్లేశం, మొండయ్య, గొల్లపల్లి మునీందర్, ముంజాల అశోక్, గుండె వెంకటేష్, గసిగంటి రవి, మ్యాక ల రాములు , బసరవేణి స్వామి, తిరుపతి, రాచకొండ ఉమేష్, దుర్ముట్ల గంగరాజు, భూతగడ్డల కనకయ్య, ఎల్లాల చుక్క రెడ్డి, బోనగిరి శ్రీనివాస్, గడ్డం రాజు, ఆవుల భీమయ్య, లక్ష్మీరాజం, తదితరులు పాల్గొన్నారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story