Karimnagar: కరీంనగర్ BJYM 'స్టూడెంట్ మార్చ్' ఏర్పాట్ల పరిశీలన
Karimnagar: కరీంనగర్‌లో బిజేవైఎం చేపట్టిన "స్టూడెంట్ మార్చ్" ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ రావు. బండి సంజయ్, రామచందర్ రావు హాజరు కానున్నట్లు వెల్లడి.
Karimnagar: కరీంనగర్ BJYM 'స్టూడెంట్ మార్చ్' ఏర్పాట్ల పరిశీలన
కరీంనగర్: భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున చేపట్టనున్న "ఫీజుల బకాయి - బిజెపి లడాయి" "స్టూడెంట్ మార్చ్" ఏర్పాట్లను బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేవైఎం నేతలతో కలిసి పరిశీలించారు.గీతా భవన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ మార్గం , కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, బీజేవైఎం నేతలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా బోయిన్పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.రాష్ట్రంలో పేరుకుపోయిన పెండింగ్ రియంబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
"ఫీజుల బకాయి - బిజెపి లడాయి" కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా కరీంనగర్‌లో తలపెట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖులు ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులురాంచందర్ రావు, కేంద్ర మంత్రివర్యులుబండి సంజయ్ కుమార్ , బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ హాజరవుతారని తెలిపారు.




