sircilla: డబుల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి బీజేపీ ముస్తాబాద్!

sircilla: ముస్తాబాద్ నుంచి దుబ్బాక వరకు మంజూరైన డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు.

KALEEM, SIRICILLA
Published on: 7 Aug 2026 5:07 PM IST
sircilla
X

sircilla: డబుల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి బీజేపీ ముస్తాబాద్!

sircilla: ముస్తాబాద్ నుంచి దుబ్బాక వరకు మంజూరైన డబుల్ రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టింది.మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ అధ్యక్షతన ముస్తాబాద్ పట్టణంలోని దుబ్బాక రహదారిపై గుంతల్లో వరి నాట్లు వేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. రహదారి అధ్వాన్నంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

ఇప్పటికే డబుల్ రోడ్‌కు మంజూరు లభించినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు మెరుగు అంజగౌడ్, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరి గోపికృష్ణ, బుచ్చేలి మహేశ్వరి, మండల ఉపాధ్యక్షులు గుండవేణి తిరుపతి, చికోటి మహేష్, బెదుర ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story