Karimnagar: రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ రోడ్డెక్కిన రైతులు బీజేపీ శ్రేణులు
Karimnagar: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
Karimnagar: రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ రోడ్డెక్కిన రైతులు బీజేపీ శ్రేణులు
కరీంనగర్: కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని పడికాపులు కాస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మంచినీటి వసతి, నీడ, రైతుల కోసం టర్పలిన్ వంటి సదుపాయాలు కల్పించాలని కొరారు. జిల్లాలో జిల్లాలో వరి ధాన్యం తర్వాత ఎక్కువ మొత్తంలో పండిన పంట మొక్కజొన్న అని వాటిని వెంటనే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న కొనుగోలు విషయంలో చాలా జాక్యం జరుగుతుందని అన్నారు.
వరి ధాన్యం విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తాలు, తరుగు పేరుతో దోపిడీని అరికట్టాలని, సంచులు రవాణా చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లలో బి కేటగిరీని తొలగించాలని, కల్లాల నుండి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం కొనుగోలు విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందని వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు కార్పొరేటర్లు బిజెపి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.




