Karimnagar: బండి సంజయ్ ఫోటో ఏది? చొప్పదండి మున్సిపల్ అధికారులపై బీజేపీ ఫైర్
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో లేకపోవడంపై బీజేపీ నేత తాడూరి శివకృష్ణ మండిపడ్డారు.
Karimnagar: బండి సంజయ్ ఫోటో ఏది? చొప్పదండి మున్సిపల్ అధికారులపై బీజేపీ ఫైర్
Karimnagar: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం 14 వార్డులో ఏర్పాటు చేసిన సభలపై మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా మున్సిపల్ అధికారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టకపోవడంపై అధికారుల తీరును బిజెపి నాయకులు తాడూరి శివకృష్ణ తప్పు పట్టారు.
ఆయన మాట్లాడుతూ చొప్పదండి మున్సిపల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అధిక శాతంలో నిధులు అందిస్తుందని, పట్టణ అభివృద్ధి కోసం వందల కోట్లు నిధులు అందించింది కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు, అభివృద్ధి కోసం నిధులు చొప్పదండి మున్సిపల్ కి అవసరమైనప్పుడు కేవలం ముఖ్యమంత్రి ఫోటో పెట్టి, ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రి ఫోటో పెట్టకపోవడం సరికాదన్నారు.
చొప్పదండి మున్సిపల్ లో నేడు బిజెపి ముగ్గురు కౌన్సిలర్స్ ఉన్నారు,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫోటో కచ్చితంగా ఉండేవిధంగా అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మున్సిపల్ అధికారులు బండి సంజయ్ గారి హోదాకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో జరుగుతున్న కార్యక్రమాల్లో కచ్చితంగా ఫోటో పెట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.




