Choppadandi: వడ్ల కొనుగోళ్ల రచ్చ.. తహశీల్దార్ ఆఫీస్ ముట్టడించిన బీజేపీ

Choppadandi: చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై బీజేపీ కిసాన్ మోర్చా నేత సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 20 May 2026 2:23 PM IST
Choppadandi
X

Choppadandi: వడ్ల కొనుగోళ్ల రచ్చ.. తహశీల్దార్ ఆఫీస్ ముట్టడించిన బీజేపీ

చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లక్షకు పైగా నింపిన బస్తాలు మరియు ధాన్యం పేరుకుపోయి, దాదాపు 50 శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోయిందని, ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ చొప్పదండి, , రూరల్, టౌన్ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి స్థానిక తహశీల్దార్ నవీన్ కుమార్‌కు బుధవారం (లేదా ఈరోజు) ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇస్తున్న హామీలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయని క్షేత్రస్థాయిలో ధాన్యం తరలింపునకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంలో రోజుకు కనీసం 3 శాతం కూడా తరలించడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే మరో నెల రోజులైనా ధాన్యం తరలింపు పూర్తి కాదు అని ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ నెల 25వ తేదీన నూతన వ్యవసాయ కార్తె (రోహిణి) వస్తున్నందున, ఆలోపే ధాన్యం పూర్తిగా తరలించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అది ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ధాన్య దిగుమతి చేసుకోకపోవడంతో లారీ యజమానులు లారీలు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ సూచనలను మిల్లర్లు పాటించడం లేదు, సరికదా మిల్లర్ల సూచనలనే ప్రభుత్వమే పాటిస్తున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం సకాలంలో గోనె సంచులు ఇవ్వకపోవడంతో, దేశాయిపేటలో రైతులే సొంతంగా సంచులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని "అకాల వర్షాలు పడితే ధాన్యం రంగు మారి అటు రైతులు, ఇటు ప్రభుత్వం ఇద్దరూ నష్టపోయే ప్రమాదం ఉందనీ అయినా సరే అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని వాపోయారు. నాణ్యమైన ధాన్యాన్ని బి గ్రేడ్ లో కొంటుంటే జిల్లా కలెక్టర్ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ యుద్ధప్రాతిపదికన మిల్లర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో:

బీజేపీ చొప్పదండి రూరల్ అధ్యక్షులు మొగిలి మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, కౌన్సిలర్ జిట్ట కుమార్, గొల్ల గట్టయ్య సింగిరెడ్డి భూమిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రమేష్ ఎడ్ల సురేష్, చల్ల అనుష్, మాజీ ఉపసర్పంచ్లు విలసాగరం అంజయ్య, బైరగొని కిట్టు గౌడ్,సంఘ నరేష్ , కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు కళ్లెం మనిష్ రెడ్డి, పెంచికల రమాదేవి, జొంగోని తిరుపతి గౌడ్.

దొంతి సారపు సంపత్, తాటికొండ కుమార్, మంచి కట్ల మల్లేష్, తాడూరి శివకృష్ణ, రాపల్లి శ్రీనివాస్, గుర్రం సమరసింహారెడ్డి, ఒడ్నాల శశిధర్, అమరగుండ తిరుపతి, నెల్లి అనిల్ ,ఊరెళ్ల తిరుపతి, ఒరుగుల తిరుపతి, బైకన్ రాజు బైర మల్లేష్, , కాలోజీ వెంకటరమణ, చుక్క శ్రీకాంత్ , కొత్తూరి అశోక్ అర్ధవెల్లి శ్రీనివాస్,, స్వర్గం కళ్యాణ్, భక్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story