Illanthakunta: దాచారం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన మారవేణి దివ్య!

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా దాచారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మారవేణి దివ్య పరిశీలించి, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 4:48 PM IST
Illanthakunta
X

Illanthakunta: దాచారం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన మారవేణి దివ్య!

ఇల్లంతకుంట: మండలంలోని దాచారం గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలను భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలను ఆమె పరిశీలించారు.

చిన్నారుల ఆరోగ్యం, ప్రాథమిక విద్య తదితర అంశాలను పరిశీలించిన మారవేణి దివ్య.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, పోషకాహార పథకాలపై అంగన్వాడి సిబ్బందికి, స్థానికులకు వివరించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, విద్యాభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని మారవేణి దివ్య పేర్కొన్నారు. అనంతరం దాచారం గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాల టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించి అభినందించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడి సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మొదటి అంగన్వాడి కేంద్రం టీచర్ గౌరవేణి ముతవ్వ, రెండో అంగన్వాడి కేంద్రం టీచర్ కొడిముంజా అరుణ, ఆయా నరిగే గౌరవ్వతో పాటు అంగన్వాడి కేంద్రాల సిబ్బంది, అల్వాల భారతి, బర్ల బాబాయి, నరిగె వర్షిణి, గ్రామానికి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA