Sultanabad: సుల్తానాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశం
Sultanabad: సుల్తానాబాద్‌లో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం. ఈనెల 10న సికింద్రాబాద్‌లో ప్రధాని మోదీ నిర్వహించనున్న ప్రజాగ్రహ సభను విజయవంతం చేయాలని నేతల పిలుపు.
Sultanabad: సుల్తానాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశం
Sultanabad: సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, మరియు ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించే అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగాబీజేపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు మీస అర్జున్ రావు, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి వారంలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పటు చేసి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జరుగుతుందని,
అదేవిదంగా ప్రియమైన ప్రధానమంత్రి గారు మూడవ సారి ప్రధానిగా అయిన తరువాత మొదటి సరిగా తెలంగాణ వస్తున్న సందర్బంగా ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దాదాపు రూ.7000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం నిర్వహించనున్న ప్రజాగ్రహ సభను ఘన విజయవంతం చేయాలని నిర్ణయించారు.
ఈ భారీ సభకు మండలంలోని అన్ని నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా, మహిళా మోర్చా సభ్యులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ స్థాయిలో సమన్వయం చేసుకుని ప్రజలను సమీకరించాలని సమావేశంలో తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి, బీజేపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు దొంగల శ్రీనివాస్ రెడ్డి, వీరగోని కిరణ్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, మెందే శంకరయ్య, వడ్లకొండ శశి వర్ధిన్, పొన్నం శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, మెంగాని రామకృష్ణ, ఎగురం రామస్వామి సుద్దాల, రాంచంద్రం, దాసరి చందు పటేల్, సాయి, పెరక రమేష్ తదితరులు పాల్గొన్నారు.




