Jammikunta: జమ్మికుంటలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌కు సన్మానం

Jammikunta: బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంటలో ఘనంగా సన్మానించిన మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం.

GANESH, JAMMIKUNTA
Published on: 1 July 2026 2:33 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌కు సన్మానం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన ఆకుల రాజేందర్ ఇటీవల బి జె పి ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షుడి గా నియామకం అయ్యారు. బుధవారం మండల కేంద్రంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాజేందర్ ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, మున్నూరు కాపు సంక్షేమ సంఘం జమ్మికుంట అర్బన్ అధ్యక్షులు ఏ బుషి శ్రీనివాస్, జిల్లా నాయకులు దాట్ల శ్రీనివాస్, కొలకాని రాజేందర్, పంతాటి రవీందర్, ఏబూసి సంపత్. ఏబూసి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story