Sircilla: సిరిసిల్లలో శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఘనంగా నిర్వహణ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Jun 2026 5:11 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఘనంగా నిర్వహణ!

సిరిసిల్ల: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు, దేశ సమగ్రత మరియు అఖండత కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ దేశ ఏకత్వం కోసం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story