Sultanabad: ప్రధాని ఇంట ముట్టడి యత్నంపై రాహుల్ గాంధీపై కందుల ఫైర్!

Sultanabad: సుల్తానాబాద్ లో ప్రధాని మోదీ ఇంటీపై దాడికి నిరసనగా బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.

KONDAL, SULTANABAD
Published on: 23 July 2026 7:13 PM IST
Sultanabad
X

Sultanabad: ప్రధాని ఇంట ముట్టడి యత్నంపై రాహుల్ గాంధీపై కందుల ఫైర్!

​సుల్తానాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో బిజెపి నాయకులు మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు సుల్తానాబాద్ మండల కేంద్రంలో నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బిజెపి నాయకులు....ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా రాహుల్ గాంధీ ప్రధాని నివాస ముట్టడికి యత్నించడం ఆయన అవివేకానికి నిదర్శనమని బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ విమర్శించారు.​

పార్లమెంట్ వేదికగా చర్చలు జరపకుండా, యువతను తప్పుదోవ పట్టించేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు కేవలం నీట్ (NEET) పరీక్ష కోసం కాదని, రాజ్యాంగాన్ని, ఆర్టికల్ 370ని మరియు దేశాన్ని విభజించే కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. పార్లమెంట్‌లో నీట్ పరీక్షపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... యువతను బలిపశువులను చేసేందుకు రాహుల్ రాజకీయం చేస్తున్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story