Sircilla: సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై బీజేపీ ధర్నా!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరం వద్ద రైతుల సమస్యలపై బీజేపీ ధర్నా. నిరంతర విద్యుత్, యూరియా అదనపు చార్జీల నిలిపివేతకు డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 13 Sept 2026 6:56 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై బీజేపీ ధర్నా!

Sircilla: ప్రధాన రహదారిపై గజసింగవరం స్టేజి వద్ద రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని, కరెంటు కోతలు, లో-వోల్టేజ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులకు యూరియా అందించాలని కోరారు.

సొసైటీ నిర్వాహకులు యూరియా బస్తాపై రూ.38 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, అదనపు చార్జీలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి సకాలంలో సరఫరా చేయాలని కోరారు.

ధర్నా విషయం తెలుసుకున్న గంభీరావుపేట మండల ఏఈ అక్కడికి చేరుకుని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాను విరమింపజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కోడె రమేశ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని, విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, హక్కుల కోసం బీజేపీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతుందని అన్నారు. రైతుల పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ రాజిరెడ్డి, బండ దేవయ్య, కార్యదర్శులు స్వామి, రాజు, మహేష్ యాదవ్, వాజిత్ హుస్సేన్, సర్వోత్తమ్, రవీందర్, సత్యనారాయణ, సంజీవ్, శ్రీశైలం యాదవ్, దేవేందర్ యాదవ్, రమేష్, చంద్రం యాదవ్, పూల్య నాయక్, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, దేవగౌడ్, ఎల్లం నవీన్, సుదర్శన్, ఎల్లం దేవరాజ్, మల్లేష్ గౌడ్, రాజేష్, వెంకటేష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA