Manthani: డిప్యూటీ సీఎం భట్టికి చందుపట్ల సునీల్‌రెడ్డి కౌంటర్!
Manthani: మంథని నియోజకవర్గం, సింగరేణి భవిష్యత్తు కోసం బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సింగరేణి భరోసా యాత్ర" విజయవంతం కావడంతో మంథనిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
Manthani: డిప్యూటీ సీఎం భట్టికి చందుపట్ల సునీల్‌రెడ్డి కౌంటర్!
Manthani: సింగరేణి భవిష్యత్తు, కార్మికుల సంక్షేమం, మంథని అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన "సింగరేణి భరోసా యాత్ర" ప్రజల్లో కొత్త ఆశలు నింపిందని మంథని బీజేపీ రాష్ట్ర నాయకుడు చంధ్రుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. మంగళవారం రామ్‌రెడ్డి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొని కార్మికులు, ప్రజలకు భరోసా ఇచ్చారని తెలిపారు.
మంథనికి బొగ్గు, గోదావరి జలాలు, ఇసుక వంటి వనరులు ఉన్నా పరిశ్రమలు, ఉపాధి లేక వెనుకబడిందన్నారు. కాళేశ్వరం, సింగరేణి వంటి కీలక ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నా స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కలేదని విమర్శించారు. మంథని నుంచి మంత్రులు, స్పీకర్లు, ప్రధాని స్థాయికి ఎదిగిన నేతలు ఉన్నా అభివృద్ధి జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకప్పుడు 1.40 లక్షల మంది పనిచేసిన సింగరేణిలో ఇప్పుడు 35 వేల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బలోపేతం చేయకుండా ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని, జెన్‌కో బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికుల జీతాలు, బోనస్‌లపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2013 తర్వాత జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోవాలన్నారు.
బొగ్గు కుంభకోణం తర్వాత సుప్రీంకోర్టు వేలం తప్పనిసరి చేసినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం తాడిచెర్ల బ్లాక్-2ను ప్రైవేట్ టెండర్లు లేకుండా నేరుగా సింగరేణికి కేటాయించిందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కేటాయింపుతో మంథనిలో మైనింగ్, అనుబంధ పరిశ్రమలు, స్కిల్ సెంటర్లు వచ్చి రామగుండం, మంచిర్యాల తరహా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఏఎమ్మార్ సంస్థ స్థానికుల భూములు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వెంటనే స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సింగరేణిని కాపాడటం, కార్మికుల ప్రయోజనాలు, యువతకు ఉద్యోగాలు కల్పించడం బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, సిలివేరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.




