Korutla: కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు.. త్వరలో బీజేపీ ప్రజా ఉద్యమం!
Korutla: కొత్తగా ఒక్క ఆసరా పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, పాత దరఖాస్తులకే అందుతున్నాయని జగిత్యాల బీజేపీ నేత మాడవేణి నరేష్ విమర్శించారు.
Korutla: కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు.. త్వరలో బీజేపీ ప్రజా ఉద్యమం!
Korutla: ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరవుతున్న ఆసరా పెన్షన్లు కొత్తవి కావని, గతంలో అధికారులకు సమర్పించిన పాత దరఖాస్తుల ఆధారంగానే అవి అందుతున్నాయని బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు మరియు ఇతర విభాగాలకు అందుతున్న పెన్షన్లు గతంలో పెండింగ్‌లో ఉన్నవే తప్ప, ప్రభుత్వం కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
బీడీ కార్మికులకు, 60 ఏళ్లు నిండిన అర్హులైన వృద్ధులకు, ఇతర అర్హులందరికీ తక్షణమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఒకే కుటుంబంలో రెండు, మూడు పెన్షన్లు పొందుతున్న అంశంపై గతంలోనే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించామని, పెన్షన్ల అర్హతల పరిశీలన పూర్తి పారదర్శకంగా జరగాలని ఆయన కోరారు. ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని మాడవేణి నరేష్ తెలిపారు.




