Jammikunta: కూడళ్ల వద్ద చేతబడి ఆనవాళ్లు.. నీటితో శుభ్రం చేసిన డాక్టర్
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని కూడళ్ల వద్ద క్షుద్రపూజల కలకలం.
Jammikunta: కూడళ్ల వద్ద చేతబడి ఆనవాళ్లు.. నీటితో శుభ్రం చేసిన డాక్టర్
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి నుండి శ్రీరాములపల్లి , మడిపల్లి కి వెళ్లే మూడు దారులలో ఆదివారం అర్ధరాత్రి భూత వైద్యులచే స్టార్ ఆకారంలో ముగ్గు పోసి పసుపు కుంకుమ, నిమ్మకాయలు, న్యూస్ పేపర్ తో మనిషి ఆకారంలో తయారు చేసిన బొమ్మ.
ఒక రూపాయి బిళ్ళ ముగ్గు పోసి పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఆ ప్రాంతంలో నుండి వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఘటన స్థలం చూసి భయంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని స్థానికుల అంటున్నారు సమాచారం అందుకున్న డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అశాస్త్రీయమైన పద్ధతులను అవలంబిస్తూ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలకు గురైన పేద, మధ్యతరగతి వారు భూత వైద్యులను ఆశ్రయించి వారికి వేలాది రూపాయల డబ్బులు చెల్లించి ఇలాంటి చేతబడులు కూడళ్ల వద్ద దింపి పోయడాలు చేయడం అజ్ఞానమని అన్నారు.
ఆర్థిక పరిస్థితులు బాగు లేకుంటే కష్టించి పనిచేస్తే డబ్బులు వస్తాయని, అనారోగ్యానికి గురైతే శాస్త్రీయ పద్ధతులలో హాస్పిటల్స్ కెళ్ళి డాక్టర్లకు చూపించుకొని మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఇలాంటి ఆశాస్త్రీయమైన మూఢనమ్మకాలకు ప్రజలు భయపడకూడదని నిర్భయంగా బ్రతికే విధంగా జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
అనంతరం పేపర్ తో తయారు చేసిన బొమ్మను కాల్చి, కట్ చేసిన నిమ్మకాయలను అక్కడినుండి తీసివేసి, ముగ్గు, పసుపు కుంకుమ చల్లిన ఆనవాళ్లను నీటితో శుభ్రం చేశారు. డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి.




