Mandini: ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసిన BLOలకు సత్కారం
Mandini: నాగారం గ్రామంలో ఓటర్ల జాబితా సర్వే (SIR) పూర్తి చేసిన BLOలను సత్కరించిన సర్పంచ్ పొనగంటి కుమార్. బూత్ నెం 57, 58లలో డిజిటలైజేషన్ వివరాలు.
Mandini: ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసిన BLOలకు సత్కారం
మంథని: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామపంచాయతీ లో SIR పక్రియను పూర్తి చేసుకున్న BLO లు. నాగారం పోలింగ్ బూత్ నెం-57 నందు గల మొత్తం ఓటర్లు-896 గాను 834 డిజిటలైజేషన్ చేయబడినవి మిగిలిన -62 లో మరణించినవి -18, డబుల్ ఓట్లు -14, షిఫ్టెడ్ -32. మరియు లింగాల పోలింగ్ బూత్ నెం-58 నందు గల మొత్తం ఓటర్లు -646 గాను 598 డిజిటలైజేషన్ చేయబడినవి.
మిగిలిన 48 లో మరణించినవి -10, డబుల్ ఓట్లు -06, షిఫ్టేడ్ -32 ఇట్టి SIR ప్రక్రియను పూర్తిచేసిన BLO సూపర్వైజర్ D. సతీష్ కుమార్,BLO లు దొంత.అమల, బూస.రేణుక గార్లను గ్రామ సర్పంచ్ పొనగంటి కుమార్ గారు ఘనంగా సత్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో BLA లు వోడ్నాల శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు,పెండ్లి.నారాయణ, మరియు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అల్లి రామ్మోహన్ గారు పాల్గొన్నారు.




