Ramagundam: కార్మికుల సంక్షేమం కోసం సంస్థను కోల్ ఇండియాలో కలుపాలని డిమాండ్
Ramagundam: రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో కార్మిక సంక్షేమం శూన్యం.. కోల్ ఇండియాలో కలిపితేనే అధికారుల సమస్యలు పరిష్కారం.
Ramagundam: కార్మికుల సంక్షేమం కోసం సంస్థను కోల్ ఇండియాలో కలుపాలని డిమాండ్
రామగుండము: పెద్దపెల్లి జిల్లా రామగుండం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో BMS జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జీ కొత్తకాపు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ అధీనంలో సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కుంటుపడిందన్నారు.
సింగరేణినీ కోల్ ఇండియాలో కలిపితే రాజకీయ జోక్యం ఉండదని, కోల్ ఇండియా హక్కులన్ని వస్తాయని అన్నారు. చరిత్రలో మొదటిసారిగా అధికారులు కూడా సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కరని ఆ ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
సింగరేణినీ కోల్ ఇండియాలో కలువడానికి రాష్ట్రప్రభుత్వం 2 శాతం వాటాను వదులుకొని కేంద్రప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో కలిపితే అధికారుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. అలాగే సింగరేణి కార్మికుల 12వ వేజ్ బోర్డు ప్రక్రియ కూడా త్వరగా ప్రారంభించాలని BMS పోరాటాలు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ మీడియా సమావేశంలో BMS అద్యక్షులు అప్పానీ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సారంగపాణి,చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్,ABKMS నాయకులు మండ రమాకాంత్, పూల రాజిరెడ్డి, సాయివేన సతీష్ తదితరులు పాల్గొన్నారు.




