Kalva Srirampur: హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: అంబేద్కర్ సంఘం

Kalva Srirampur: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.

KONDAL, SULTANABAD
Published on: 13 Sept 2026 5:55 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: అంబేద్కర్ సంఘం

కాల్వ శ్రీరాంపూర్: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ పై కల్పిత నాయకుడనే పుస్తకం రాసిన హమారా ప్రసాద్ పై కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై కి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారానే తమకు అన్ని హక్కులు వచ్చాయని, రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని అన్నారు. అంబేద్కర్ కు రిజర్వేషన్ కు వ్యతిరేకంగా పుస్తకం విడుదల చేయడాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్ పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల రాజేశం, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విజయ్ సాగర్, సమాచార హక్కు చట్టం అధికార ప్రతినిధి ఉయ్యాల ఓదెలు, సమాచార హక్కు చట్టం కార్యదర్శి దొమ్మటి హరీష్, జిల్లా ఉపాధ్యక్షుడు జీలకర్ర రాకేష్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి సిరికొండ నిశాంత్, మాజీ ఎంపీటీసీ మొగిలి సదానందం,మాజీ సర్పంచ్ సిరికొండ కొమురయ్య, బోటుక రవి,కండెం శ్రీశైలం, సదానందం, తాండ్ర సురేష్, తాండ్ర అనిల్, గోపు సతీష్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD