Sircilla: అనారోగ్యంతో ఒంటరి వ్యక్తి మృతి; అంత్యక్రియలకు సాయం!

Sircilla: బొప్పాపూర్‌లో అనారోగ్యంతో ఒంటరి వ్యక్తి మిడిదొడ్డి శంకరయ్య మృతి; కుటుంబసభ్యులు లేకపోవడంతో అంత్యక్రియలకు సాయం చేయాలని స్థానికుల వేడుకోలు.

KALEEM, SIRICILLA
Published on: 2 Sept 2026 9:38 AM IST
Sircilla
X

Sircilla: అనారోగ్యంతో ఒంటరి వ్యక్తి మృతి; అంత్యక్రియలకు సాయం!

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి శంకరయ్య (75) అనారోగ్యంతో మృతి చెందారు. భార్య, కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే జీవిస్తున్న శంకరయ్య మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించడం గ్రామంలో విషాదం నింపింది.

స్థానికుల వివరాల ప్రకారం.. శంకరయ్య వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. గత మూడు రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి బుధవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూడగా శంకరయ్య మృతి చెందినట్లు గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నట్లు తెలిపారు.

శంకరయ్యకు భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ లేరని గ్రామస్తులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో దయామయులు ముందుకు వచ్చి శంకరయ్య అంత్యక్రియలకు ఆర్థికంగా సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story