Sircilla: మా రక్తమైనా తీసుకోండి.. కానీ రైతులకు కాలేశ్వరం నీళ్లివ్వండి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.
Sircilla: మా రక్తమైనా తీసుకోండి.. కానీ రైతులకు కాలేశ్వరం నీళ్లివ్వండి!
Sircilla: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రైతుల పంట పొలాలకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ఈ శిబిరంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, "మా రక్తమే కావాలంటే తీసుకోండి.. కానీ రైతుల పంట పొలాలకు కాలేశ్వరం నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి" అని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో నాఫ్‌స్కోబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగారావు, గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




