Peddapalli: కలెక్టరేట్ ముట్టడి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల భారీ ధర్నా

Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో BRS భారీ ధర్నా. సాగునీరు, విద్యుత్, ఎరువులు, బిల్లుల పెండింగ్‌పై ఆగ్రహం.

RAJU, PEDDAPALLI
Published on: 27 July 2026 2:00 PM IST
Peddapalli
X

Peddapalli: కలెక్టరేట్ ముట్టడి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల భారీ ధర్నా

పెద్దపల్లి జిల్లా: కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది రైతులు, కార్యకర్తలు గుమిగూడారు.ఈ ధర్నాలో రైతులు పలు డిమాండ్లతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, పొలాలకు సకాలంలో నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని నేతలు ఆరోపించారు. యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాలో జాప్యం జరుగుతోందని, దళారులు అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నాణ్యమైన ఎరువులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని

ఇక మొక్కజొన్న పంట అమ్మిన రైతులకు రావాల్సిన వర్ధన్ డబ్బులు ఇంకా జమ కాలేదని ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పంట చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున రైతు సోదరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చివరగా BRS నేతలు కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీరు, కరెంట్, ఎరువులు, వర్ధన్ డబ్బుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు...

బైట్ :- పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story