Jagtial: దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి..కొడిమ్యాల బీఆర్ఎస్!
Jagtial: కరీంనగర్ అలుగునూరులో జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని కొడిమ్యాల బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
Jagtial: దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి..కొడిమ్యాల బీఆర్ఎస్!
Jagtial: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆ చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ నెల 29వ తేదీ (ఆదివారం) కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న 'దీక్షా దివస్ స్ఫూర్తి సభ'ను విజయవంతం చేయాలని కొడిమ్యాల మండల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
శనివారం కొడిమ్యాల మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలుగునూరు సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.
చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కొడిమ్యాల మండలం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి చాటిచెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు మల్యాల మహిపాల్,
హరేందర్, మల్లేశం, రమేష్, మాజీ ఉపసర్పంచులు అబ్దుల్ సుకుర్, బైరి వెంకటి, వార్డు సభ్యులు పర్లపల్లి అఖిల్, చందు, సత్యం, నాయకులు అంకం రాజేశం, పర్లపల్లి ప్రభుదాస్, గడ్డం లక్ష్మారెడ్డి, నరసయ్య, రామంచ లక్ష్మణ్, నాగరాజు, సుమంత్, మనోజ్, శ్రావణ్, సాయి, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.




