Jagtial: జగిత్యాల పీఎస్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!
Jagtial: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకరయ్యలపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పీఎస్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Jagtial: జగిత్యాల పీఎస్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!
జగిత్యాల: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి చావు డప్పు కొడతామన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఆయనను ప్రోత్సహించిన సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జెడ్పీ తొలి చైర్‌పర్సన్ దావా వసంత, పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్ కేసులు పెట్టాలి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకోవడం క్షమించరాని నేరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రేవంత్ రెడ్డి, శంకరయ్యలపై పోలీసులు వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు.
హామీల వైఫల్యంపై నిలదీత: ఆరు గ్యారంటీలు, మహాలక్ష్మి ₹2,500, బీడీ కార్మికుల పెన్షన్లు, ఆటో కార్మికులకు ₹12,000 భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని, వీటిపై ప్రశ్నిస్తారనే భయంతోనే అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
పోలీసుల పక్షపాతం: కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు పోలీసులకు కనిపించడం లేదా అని, చట్టం అందరికీ ఒకేలా ఉండాలని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై చిల్లర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.




