Karimnagar: కరీంనగర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా

Karimnagar: కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ గంగాధరలో బీఆర్ఎస్ నేతలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 8 May 2026 3:28 PM IST
Karimnagar
X

Karimnagar

Karimnagar: కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో భాగంగా జాతీయ రహదారి 563పై బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నా కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story