Sircilla: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నల్ల బ్యాడ్జీల నిరసన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలిపారు.
Sircilla: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నల్ల బ్యాడ్జీల నిరసన!
Sircilla:ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి, వెంకట్రావుపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గత 1000 రోజులుగా తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామ నర్సరీల నిర్వహణ కూడా సరిగా జరగడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో AMC మాజీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్, గొల్లపల్లి సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్), ఉపసర్పంచ్ ఓర్పుల లక్ష్మణ్, గ్రామాల అధ్యక్షులు పత్రి అంజయ్య, తోటిపెల్లి తిరుపతి, వార్డు సభ్యుడు జెట్టి నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షుడు ఒరుపుల రాములు, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు ఒరుపుల రామస్వామితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.




