Peddapalli: గోదావరిఖనికి వెళ్తున్న హరీష్ రావుకు ఘన స్వాగతం!
Peddapalli: గోదావరిఖనికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావుకు పెద్దపల్లి బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
Peddapalli: గోదావరిఖనికి వెళ్తున్న హరీష్ రావుకు ఘన స్వాగతం!
Peddapalli: పెద్దపల్లి రామగుండం సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పీటీ స్వామి సంస్మరణ సభకు గోదావరిఖనికి వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఘన స్వాగతం లభించింది.
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




