Sircilla: పొత్తూరు బ్రిడ్జిపై మహాధర్నా.. ఎంబీఆర్ నీటి విడుదలకు డిమాండ్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
Sircilla: పొత్తూరు బ్రిడ్జిపై మహాధర్నా.. ఎంబీఆర్ నీటి విడుదలకు డిమాండ్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు బ్రిడ్జిపై మిడ్ మానేర్ రిజర్వాయర్ (ఎంఎంఆర్) నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ, మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మహాధర్నాలో బోయినపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాస్తారోకోతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.




