Manthani: గైనకాలజిస్ట్‌ను నియమించాల్సిందే.. మంథనిలో పుట్ట శైలజ దీక్ష!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మాతా శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.
Manthani: గైనకాలజిస్ట్‌ను నియమించాల్సిందే.. మంథనిలో పుట్ట శైలజ దీక్ష!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ఎదుట మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట శైలజ తో పాటు మహిళలు పాల్గొన్నారు. మహిళలు హాస్పిటల్ ఎదురుగా దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా డాక్టర్ ను నియమించే వరకు మీరు ఏమి చేయలేదని మహిళలు పోలీసులను ప్రతిఘటించారు.
ఈ సందర్భంగా పుట్ట శైలజ మాట్లాడుతూ.మాతా శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వెంటనే శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళ గర్భవతుల సమస్యలను తీర్చడానికి మాత శిశు హాస్పిటల్ లో నిర్మించాలన్నారు. అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంథనిలోని మాత హాస్పిటల్ లో ఎంతోమంది గర్భిణీ స్త్రీలకు సిజరెన్లు చేశారన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 నెలలు గడిచిన గైనకాలజిస్ట్‌ను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత శిశు హాస్పిటల్ లో ఎన్ని సీజరెన్లు చేశారో మేము శ్వేత పత్రం విడుదల చేస్తాము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని సీజరీన్లు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానికులు పాల్గొన్నారు.




