Illanthakunta: చెవిలో పూలు పెట్టుకుని ఇల్లంతకుంటలో బీఆర్ఎస్ వినూత్న నిరసన!

Illanthakunta: కాంగ్రెస్ పాలనపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన. చెవిలో పూలు పెట్టుకుని కేటీఆర్ ఆదేశాలతో ఆందోళన చేపట్టిన నేతలు.

KALEEM, SIRICILLA
Published on: 6 Sept 2026 1:34 PM IST
Illanthakunta
X

Illanthakunta: చెవిలో పూలు పెట్టుకుని ఇల్లంతకుంటలో బీఆర్ఎస్ వినూత్న నిరసన!

Illanthakunta: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, 420 వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు నిరసనగా నాయకులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, గ్రామాల్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు మెరుగుపరచాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ ఉపసర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు ఎండీ సాదుల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కునబోయిన రఘు, వార్డు సభ్యులు కొట్టే ప్రమీల వెంకన్న, దయ్యాల శ్రీలత మహేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దొంతుల శంకర్, సోషల్ మీడియా అధ్యక్షులు నవీన్, మాజీ వార్డు సభ్యులు భాస్కర్, మామిడి తిరుపతి, నర్సయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సతీష్, పరశురాములు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story