Jammikunta: మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా.. కారణం వెల్లడించిన చైర్మన్
Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీ కో-ఆప్షన్ ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ప్రకటించారు.
Jammikunta: మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా.. కారణం వెల్లడించిన చైర్మన్
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో శనివారం నిర్వహించవలసిన కోఆప్షన్ ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి కో ఆప్షన్ పోటీకి వచ్చిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగి ఉండడంతో పాటు వారి అనుభవాన్ని పరిగణలోనికి తీసుకొని సామాజిక సమతుల్యత పాటించవలసిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించే విధంగా విధంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నుండి 19 మంది అభ్యర్థులు ఉండడం వల్ల ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎ పిక్ ధ్రువీకరణను సక్రమంగా పారదర్శకంగా నిర్వహించడం కోసం సమయం తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు సీనియర్ నాయకులతో చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు పాలకవర్గం మీద ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్మన్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసి కో ఆప్షన్ ఎన్నికను పారదర్శకతతో నిర్వహిస్తామని చైర్మన్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.




