Peddapalli: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నిరసన!

Peddapalli: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. పట్టణంలో పారిశుద్ధ్య లోపాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్.

RAJU, PEDDAPALLI
Published on: 6 Sept 2026 1:00 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నిరసన!

Peddapalli: పెద్దపల్లి మున్సిపల్ శాఖ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాలతో పెద్దపల్లి పట్టణ బీఆర్‌ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

పట్టణంలో దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడం, ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ లేకపోవడం, డ్రైనేజీలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం, ఇంటింటికీ చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన సమయంలో కొంతమంది కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయ గేటు దూకేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించి, దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story