Thangallapalli: తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వాడవాడలా నిరసన!
Thangallapalli: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీఆర్‌ఎస్ నిరసన. హామీలు నెరవేర్చాలని వాడవాడలా ఆందోళన కార్యక్రమాలు.
Thangallapalli: తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వాడవాడలా నిరసన!
Thangallapalli: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసనలో భాగంగా పార్టీ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామపంచాయతీలకు తగినన్ని నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమం కూడా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సక్రమంగా కొనసాగడం లేదని ఆరోపించారు. కొత్త బోర్ల ఏర్పాటుకు, తాగునీటి కోసం కొత్త పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు లేవని పేర్కొన్నారు.
గ్రామాల్లో కనీసం మురుగు కాలువ నిర్మించేందుకు కూడా నిధులు, అనుమతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




