Karimnagar: కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం!
Karimnagar: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా బెజ్జంకి రాజీవ్ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Karimnagar: కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిరసన: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం!
Karimnagar: మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర ప్రవర్తనను ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అసభ్యకర ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి బీఆర్‌ఎస్ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.
మహిళా ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాకాల మైపాల్ రెడ్డి, రావుల రామకృష్ణారెడ్డి, లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, రాజయ్య, ఎలా శేఖర్‌బాబు , అనిల్ , బాబు గాజరాజు, నరేష్, సురేష్, మొండయ్య, సంపత్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




