Peddapalli: కేసీఆర్ హయాంలోనే దళితులకు పెద్దపీట: రసమయి బాలకిషన్!

Peddapalli: కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన సంక్షేమం పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ సమావేశం కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్ అమలుపై రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి నిలదీత.

RAJU, PEDDAPALLI
Published on: 1 Oct 2026 9:07 PM IST
Peddapalli
X

Peddapalli: కేసీఆర్ హయాంలోనే దళితులకు పెద్దపీట: రసమయి బాలకిషన్!

పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి BRS పార్టీ SC సెల్ ముఖ్య నాయకుల సమావేశం గురువారం రంగంపల్లిలోని RR గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ... గత BRS ప్రభుత్వ హయాంలో దళితుల విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశామని అన్నారు. దళితబంధు, విదేశీ విద్య, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షల శిక్షణ, కల్యాణలక్ష్మి పథకాలతో దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించామని అన్నారు.

చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దళితులను మోసం చేసిందని ఆరోపించారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల సహాయం, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఇచ్చిన SC, ST హామీలను వెంటనే అమలు చేయాలని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లో అంబేద్కర్ అభయహస్తం కింద ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాళ్లపల్లి లింక్ కెనాల్ ద్వారా పెద్దపల్లికి కాళేశ్వరం జలాలు వచ్చే వ్యవస్థ ఉందని గుర్తు చేశారు.

మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ల డిక్లరేషన్, అభయహస్తం మేనిఫెస్టోలోని SC రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు, మహిళలకు నెలకు రూ.2500, విద్యా భరోసా కార్డు, ఇంటి స్థలం వంటి అమలు కాని హామీలపై ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ SC సెల్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI