Manthani: కాంగ్రెస్ 420 హామీలపై మంథని ప్రజావాణిలో బీఆర్ఎస్ వినతి!
Manthani: కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంథని ప్రజావాణిలో అధికారులకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
Manthani: కాంగ్రెస్ 420 హామీలపై మంథని ప్రజావాణిలో బీఆర్ఎస్ వినతి!
Manthani: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు గడిచినా ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల, పట్టణ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.




