Sircilla: చిక్కాల రామారావు కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్

Sircilla: రిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఆకస్మిక మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Jun 2026 4:48 PM IST
Sircilla
X

Sircilla: చిక్కాల రామారావు కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్

Sircilla: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కాల రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. చిక్కాల రామారావు తనయుడు అశ్విన్ రావు ఆకస్మిక మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అశ్విన్ రావు మృతి కుటుంబానికి తీరని లోటని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షించారు.

ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అశ్విన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story